ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ”కొత్త కొత్తగా”..!

సినిమా: కొత్త కొత్తగా
నటీనటులు: అజయ్, వీర్తి వాఘాని
నిర్మాత: మురళీధర్ రెడ్డి
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి

డైరెక్టర్ ఈ సినిమాను కాస్త కొత్తగా చూపించి ప్రేక్షకులను బాగా సర్ప్రైజ్, ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇందుకు తోడు మ్యూజిక్, కొరియోగ్రఫీ, నిర్మాణం చాలా అద్భుతంగా నిర్మించారు. ఈరోజు ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:
ఇందులో ఆనంద్, కళ్యాణి నటరాజన్ ల కూతురు రాజీ(వీర్తి వఘాని). ఇక విశ్వనాధ్, తులసీల కొడుకు సిద్దు (అజయ్). ఇద్దరూ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటారు. తొలిచూపులోనే సిద్దు, రాజీని ఇష్టపడి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇక రాజీ కూడా అబ్బాయిలకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేది కాదు. కానీ సిద్ధు ను చూడగానే ఇష్టపడుతుంది. ఇది కొనసాగుతుండగా రాజీ వాళ్ళ అన్న కేశవ్ దూరపు సంబంధం చూసి చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. మరోవైపు కేశవ్ బామ్మర్ది రామ్ (పవన్ తేజ్) తన అక్కతో రాజీ ని పెళ్లి చేసుకుంటానని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని అక్కను ఒప్పిస్తాడు. రామ్ తల్లిదండ్రులు రాజీ తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం ఫిక్స్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు చదువును వదులుకుంది. కానీ మనసులో ఉన్న సిద్దును మరిచిపోలేక, కుటుంబ సభ్యులకు చెప్పలేక మనసులో బాధ పెట్టుకుని ఏం చేస్తుంది అన్నది. మిగిలిన కథ. ఇక తెరపైనే చూడాలి.

నటినటుల నటన: విజయ్ మొదటిసారి తెరకు పరిచయం అవుతున్న ఎంతో అనుభవం ఉన్న నటుడుగా అద్భుతంగా తన పాత్రలో కనిపించాడు. ఇక హీరోయిన్ వీర్తి వఘాని కూడా తన ఎక్స్ప్రెషన్స్, తన నటనతో ఇట్టే ఇమిడిపోయింది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మిగతా నటులు కూడా చక్కగా నటించి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్: డైరెక్టర్ కొత్త కొత్తగా సినిమాను కాస్త డిఫరెంట్ గా ఆలోచించి మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేశాడు. కథ రొటీన్ కు భిన్నంగా ఉండడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా, కొరియోగ్రాఫర్ అందంగా రూపొందించారు. నిర్మాత కూడా ఎక్కడ రాజీ పడకుండా అద్భుతంగా నిర్మించడం జరిగింది.

విశ్లేషణ: డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్ అయితేనే ప్రజాదరణ పొందవచ్చని ప్రస్తుతఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ”కొత్త కొత్తగా”..మూవీ రివ్యూ!

ప్లస్ పాయింట్స్: ఇక ఈ సినిమాకు కథతో పాటు నటీనటుల నటన, అద్భుతమైన మ్యూజిక్, అందమైన సినిమాటోగ్రఫీ మంచి ప్లస్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్: ఇక ఈ సినిమాలో కాస్త అక్కడక్కడ కథ స్లోగా నడిచింది అని చెప్పవచ్చు అంతే, పెద్దగా మైనస్ పాయింట్స్ ఎక్కడ అయితే కనిపించలేదు.

బాటమ్ లైన్: మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ సభ్యులతో చూడదగిన చిత్రం. ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.

రివ్యూ రేటింగ్: 3/5