Kortala Shiva: ఇండస్ట్రీలోకి రాకముందే రిటైర్మెంట్ ప్రకటించిన కొరటాలశివ… కారణం అదేనా?

Kortala Shiva: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు బాగా మంచి విజయాలు అందుకుని ఇండస్ట్రీలో పదికాలాలపాటు కొనసాగాలని భావిస్తారు. కానీ డైరెక్టర్ కొరటాల శివ మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఆయన దర్శకుడిగా పరిచయమైన తరువాత కేవలం పది సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించి అనంతరం దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ విధంగా ఇండస్ట్రీలోకి రాకముందే కొరటాల శివ రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కొరటాల శివ దర్శకుడిగా పరిచయం కాకముందు రచయితగా మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే పలు సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల తాను పది కథలను సిద్ధం చేసుకున్నారట. ఈ క్రమంలోని ఈ 10 సినిమాలకు దర్శకత్వం వహించి అనంతరం దర్శకుడిగా రిటైర్మెంట్ పొందాలని కొరటాల ముందుగానే భావించినట్లు తెలుస్తోంది.ఇలా పది సినిమాల తర్వాత ఆయన దర్శకుడిగా రిటైర్మెంట్ అయ్యి నిర్మాతగా మారాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే తను రాసుకున్న 10 సినిమా కథలు పూర్తి అయితే కొరటాల నిర్మాతగ మారనున్నారు.

ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో వచ్చిన మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రం ఆచార్య ఈనెల 29వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని చాలామంది భావిస్తున్నారు.ఇలా వరుస విజయాలను అందుకోని దూసుకుపోతున్న కొరటాల తన రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకుంటారా…. లేక తాను అనుకున్న విధంగానే దర్శకుడిగా రిటైర్ అయి నిర్మాతగా మన ముందుకు రానున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.