కొరటాల శివ సూపర్ హ్యాపీ అట నిజమేనా??

టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో అయితే తన మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకొని నెక్స్ట్ కూడా వరుస బాక్సాఫీస్ విజయాలు సాధిస్తూ వరుస విజయ చిత్ర దర్శకునిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. అయితే ఈ దర్శకుడు విజయాలకు మెగాస్టార్ తో చేసిన “ఆచార్య” చిత్రం భారీ డిజాస్టర్ అయ్యి కొరటాలకి కూడా ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.

దీనితో ఈ చిత్రం దెబ్బ కొరటాలకి మాములుగా తగల్లేదు. పైగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా కొరటాలనే బ్లేమ్ చేయడం మరింత ఎబ్బెట్టుగా మారింది. అయితే అక్కడ నుంచి మెగా కాంపౌండ్ కి దూరంగానే ఉంటున్న కొరటాల అక్కడ నుంచి చిరు అంటే కోపంగా క్కూడా ఉన్నాడని సినీ వర్గాల్లో ఓ టాక్ ఉంది.

అయితే ఇక లేటెస్ట్ గా చిరు చేసిన చిత్రం “భోళా శంకర్” డిజాస్టర్ తో కొరటాల సూపర్ హ్యాపీగా ఉన్నాడని సినీ వర్గాల్లో ఓ టాక్ ఇప్పుడు మొదలైంది. తనకి ప్లాప్ టైం లో చిరు కూడా తనని బ్లేమ్ చేయగా ఇప్పుడు చిరు సినిమా ప్లాప్ అవ్వడంతో కొరటాల దీనిని ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటున్నారు.

మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో వారికే తెలియాలి. ఇక ఇపుడు కొరటాల అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనితో అయితే కొరటాల అందరికీ సమాధానం ఇస్తాడని నందమూరి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.