Home News చికెన్‌తో ‘కోలిపట్టు’ కూర వండిన ర‌ష్మిక‌..చెఫ్‌గా ఛాన్సివ్వండి అని కోరుతున్న ఉపాస‌న‌

చికెన్‌తో ‘కోలిపట్టు’ కూర వండిన ర‌ష్మిక‌..చెఫ్‌గా ఛాన్సివ్వండి అని కోరుతున్న ఉపాస‌న‌

మెగా కోడ‌లు ఉసాస‌న బిజినెస్ రంగంలో దూసుకెళుతుంది. ఆ మ‌ధ్య‌ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ, అర్హులైన నిపుణుల నుండి నిర్దుష్టమైన సమాచారాన్నిఅందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్ర‌జ‌ల‌కు ఎలా అందించాల‌నే ఉద్ధేశంతో URLife.co.in అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. దీనికి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ఉపాస‌న ప్రస్తుత కాలానికి తగిన ఆరోగ్య సూత్రాలను, పోషకాల గురించిన వీడియోలను, ఆహార నియమాల ప్రణాళికలను, జీవనశైలి సలహాలను, సూచనలను సెల‌బ్రిటీల‌తో ఇప్పిస్తుంది.

Rashmika 1 | Telugu Rajyam

ఇందుకోసం పలువురు భామ‌ల‌ని గెస్ట్ ఎడిట‌ర్‌గా పిలిపించి వారిచేత వెరైటీ వంట‌లు చేయిస్తుంది. ఆ మ‌ధ్య స‌మంత‌తో పోషకాహార‌పు వంట‌లు చేయించి వావ్ అనిపించింది. ఇక తాజాగా ర‌ష్మిక‌తో కోలిప‌ట్టు కూర చేయించింది. చికెన్‌తో చేసిన కోలిప‌ట్టు కూర రుచి చూసిన ఉపాస‌న వంద‌కు వంద మార్కులు ఇచ్చింది. అంతేకాదు చెఫ్‌గా ప‌నికొస్తావు, ఎవ‌రైన చెఫ్ ఛాన్స్ ఉంటే ఇవ్వండ‌ని కామెడీ చేసింది ఉపాస‌న‌. ఇందుకు సంబంధించిన వీడియోని ఉప్సీ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఫుల్ వైర‌ల్ అయింది.

ర‌ష్మిక మందాన సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె ప్ర‌స్తుతం పుష్ప అనే సినిమా చేస్తుంది. అల్లు అర్జున్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ అమ్మ‌డు త‌న పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పిస్తుంద‌ట‌. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News