హైపర్ ఆదికి హగ్.. సుధీర్ కి కిస్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. మొదట్లో ఈ షో పరవాలేదు అనిపించినప్పటికీ రోజు రోజుకి సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. మల్లెమాల జబర్దస్త్ ఆర్టిస్టులు అందర్నీ తీసుకెళ్లి శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో సందడి సందడి చేస్తోంది. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోలో ఎవరో ఒకరు గెస్ట్ వుండే విధంగా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. ఈ క్రమంలోనే మే 29న ప్రసారం కానున్న షోకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఆ ప్రోమో లో హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి సందడి చేసింది. అయితే ప్రతివారం గెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్న సెలబ్రిటీలు ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోఒక వెలుగు వెలిగి దూరం అయిన వారే. రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న సెలబ్రిటీలకు ఈ షో కర్టెన్ రైజర్ గా ఉపయోగపడుతోంది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో కుమారి 21 ఎఫ్ సినిమా ద్వారా పరిచయమైన హెబ్బా పటేల్ సందడి సందడి చేసింది. మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది హెబ్బా పటేల్.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ప్రేక్షకులకు దగ్గర అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఊహించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోయాయి. ఇకపోతే ప్రస్తుతం హెబ్బా పటేల్ మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆమె మెరిసింది. ఈ క్రమంలోనే సుధీర్ మాట్లాడుతూ నేను హీరోగా యాక్ట్ చేస్తే మీరు హీరోయిన్ యాక్టింగ్ చేయాలి అని అడుగుతాడు. దానికి ముందు ఆమె అర్థం కానట్లు ఫేస్ పెట్టడంతో ప్రోగ్రాం కి హాజరైన గెస్ట్ గా హాజరైన ఆమని నువ్వు నచ్చలేదు అనుకుంటా అందుకే చేయను అంటోంది అని అంటుంది.

వెంటనే విషయం అర్థమైన హెబ్బా పటేల్ అదేమీ లేదు బాగా నచ్చావ్ అంటూనే ఫ్లయింగ్ కిస్ సుదీర్ కు ఇస్తుంది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది, రాంప్రసాద్ ఇద్దరూ కూడా హెబ్బా పటేల్ ను ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాగానే ఆనవాయితీ ఏంటో తెలుసా అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాగానే ముందు బావలకు హగ్ ఇవ్వాలి అని అంటాడు హైపర్ ఆది. వెంటనే ఏమీ ఆలోచించకుండా హెబ్బా పటేల్ హైపర్ ఆదికి హగ్ ఇస్తుంది. దీంతో హైపర్ ఆది ఏదో జరిగిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.