Dilruba Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మంచి ఊపు మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం. అందులో భాగంగానే ఇటీవలే క అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించింది. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కిరణ్ అబ్బవరం.
ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. తాజాగా కిరణ్ నటిస్తున్న చిత్రం దిల్ రూబా. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది.
అందులో భాగంగానే తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఆ టీజర్ మ్యాగీ మై ఫస్ట్ లవ్ అంటూ కిరణ్ అభవరం వాయిస్ తో మొదలవుతుంది. ఆ తర్వాత తన డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు కిరణ్. మొత్తానికి ఈ టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇందులో లవ్ యాక్షన్ సన్నీ వేషాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.