ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆర్పీ ప్రస్తుతం ఆ షో కి దూరంగా ఉంటూ..మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తున్నాడు. హోటల్లో సర్వార్ గా పనిచేస్తున్న ఆర్పీకి జబర్దస్త్ షో జీవితాన్ని ఇచ్చింది. అయితే ఆర్పీ ఇలా కమేడియన్ గా పాపులర్ అయిన తర్వాత తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ నిర్వాహకులపై విమర్శలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
ఈ క్రమంలో ఆర్పీ జబర్దస్త్ పై విమర్శలు చేస్తూ నాగబాబుని మాత్రం దేవుడని పొగుడుతున్నాడు. నాగబాబు పేరుని తన గుండెల పై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అయితే నాగబాబు మీద అంత అభిమానం ఎందుకు అని? ఆర్పీ ని అడగగా.. నాగబాబు గారు నాకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచారు. అందువల్లే ఆయన నాకు దేవుడు అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో జబర్దస్త్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ..ఆయన ప్రతి విషయాన్ని బిజినెస్ గానే చూస్తారు. ప్రతీ విషయంలో నీకెంత నాకెంత అన్నట్లు ఆలోచిస్తారు అంటూ విమర్శించాడు.
అయితే ఇప్పుడు తనకి దేవుడని చెప్పుకుంటున్న నాగబాబు కూడా ఒకప్పుడు జబర్దస్త్ షో జీవితాన్ని ఇచ్చింది. ఆరెంజ్ సినిమాకి నిర్మాతగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన నాగబాబుకి జబర్దస్త్ లో అవకాశం కల్పించి నాగబాబు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కారణం జబర్దస్త్. అయితే గతంలో నాగబాబు కూడా రెమ్యూనరేషన్ విషయంలో, ఫుడ్ విషయంలో మల్లెమాల వారితో మనస్పర్థలు వచ్చి జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నాగ బాబుకు సన్నిహితంగా ఉన్న కొంతమంది కమెడియన్లు కూడా ఆయనతో పాటు జబర్దస్త్ కి దూరమయ్యారు. అయితే జబర్దస్త్ గురించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.