Kohli Shakes Legs For Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెన్స్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప ది రైజ్” కోసం తెలిసిందే. మరి అన్ని రకాలుగా కూడా భారీ హైప్ మరియు రీచ్ తెచ్చుకున్న ఈ సినిమా లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా ఇండియన్ వైడ్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
అయితే వాటిలో స్టార్ హీరోయిన్ సమంత పై చేసిన ఊ అంటావా అనే వెరీ హాట్ సాంగ్ అయితే క్రేజీ హిట్ అయ్యింది. మరి ఈ సాంగ్ కి గాను లేటెస్ట్ గా ఇండియన్ క్రికెట్ దిగ్గజ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీ తమ ఐపీఎల్ క్రికెట్ టీం ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇచ్చిన చిన్న పార్టీ లో ఆ సాంగ్ కి స్టెప్పులు వేసాడు.
అందులో ఐకానిక్ స్టెప్ ని వేస్తూ అదరగొట్టగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనితో అల్లు అర్జున్ మరియు కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు సుకుమార్ పుష్ప రెండో భాగానికి వర్క్ లు ఫినిష్ చేస్తుండగా అల్లు అర్జున్ కూడా షూట్ కి సిద్ధం అవుతున్నాడు. అలాగే రష్మికా అయితే ఆగస్టు నుంచి షూటింగ్ లో పాల్గొననుంది.
🤩❤️🔥💥 #Pushpa #OoAntavaOoOoAntava https://t.co/AILiUBeato
— Pushpa (@PushpaMovie) April 28, 2022