డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయనున్న కిచ్చా సుదీప్ ..?

కన్నడ సూపర్ స్టార్ కిచ్ఛా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. సుదీప్ నటించిన ఎన్నో సినిమాలు డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. అంతే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో కూడా సుదీప్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇలా టాలివుడ్ లో సుదీప్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా అనూప్‌ భండారి దర్శకత్వంలో సుదీప్ హీరోగా నటించిన తాజా చిత్రం విక్రాంత్ రోణ.

పాన్ ఇండియా లెవెల్ తెలుగు, తమిళ్, హిందీ, మలయం,కన్నడ భాషలో జులై 28న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదలైన నాలుగురోజులలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంటెన్సివ్‌ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుదీప్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించింది. సిల్వర్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా తొందర్లోనే డిజిటల్ స్క్రీన్ మీద అలరించనుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో సెప్టెంబర్‌ 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాకి భారి మొత్తం చెల్లించి జీ 5 సంస్థ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించింది.

ఈ సినిమాలోని రక్కమ్మ అనే పాట యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేసింది. తెలుగు సింగర్ మంగ్లీ పాడిన ఈ పాట యువతను బాగా ఆకట్టుకుంది. ఈ పాట మీద వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాటే వినిపిస్తోంది. భండారి దర్శకత్వం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని మంజునాథ్ గౌడ్ నిర్మించారు. ఈ సినిమాలో సుదీప్, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరో, హీరోయిన్లు గా నటించగా నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, రవిశంకర్‌ గౌడ్‌ వంటి వారు ప్రధన పాత్రలలో నటించారు.