ఆదిపురుష్ మరో అప్ డేట్: సీతగా కీర్తి సురేశ్ కాదట.. ఈ స్టార్ హీరోయిన్ ఫిక్సట..!

Kiara Advani to play sita role in prabhas adipurush

ఆదిపురుష్.. ఈ సినిమా గురించే ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకూ రాలేదు. ఎంతైనా ప్రభాస్ సినిమా కదా. అందులోనూ తొలిసారిగా డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. అది కూడా రామాయణ ఇతిహాసం మీద. అందుకే ఈ సినిమాకు అంత హైప్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి అవతారం ఎత్తనున్నారు.

Kiara Advani to play sita role in prabhas adipurush
Kiara Advani to play sita role in prabhas adipurush

రాముడిగా ప్రభాస్ కరెక్ట్ గా సూట్ అవుతారని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాముడైతే సెట్ అయ్యారు కానీ… రాముడికి తగ్గ సీత కూడా దొరకాలి కదా. అందుకే ప్రభాస్ కు సూట్ అయ్యే హీరోయిన్ వేటలో పడింది మూవీ యూనిట్.

ముందుగా సీత క్యారెక్టర్ ను కీర్తి సురేశ్ కు ఇద్దామనుకున్నారట. కీర్తిని ఓకే కూడా చేశారట. ఆ తర్వాత ఏమైందో కానీ.. కీర్తి సురేశ్.. ఆదిపురుష్ సినిమాలో నటించడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రియాంక చోప్రాను సీతగా తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అవీ ఉత్తుత్తే అయిపోయాయి.

Kiara Advani to play sita role in prabhas adipurush
Kiara Advani to play sita role in prabhas adipurush

చివరకు ప్రభాస్ కు జోడీగా అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీల్లో మంచి పేరు ఉన్న కియరా అద్వానీని సీతగా తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు తెలుగులోనూ కియరా అద్వానీ స్టార్ హీరోయిన్. ఇటు హిందీలోనూ టాప్ హీరోయిన్. అందులోనూ ప్రభాస్ కు కియరా సరైనా జోడి అంటూ ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చూద్దాం.. ప్రభాస్ కు జోడీగా కియరా నటిస్తుందా? లేక ఇంకెవరిని అయినా మూవీ యూనిట్ తీసుకుంటుందా? మొత్తానికి ఆదిపురుష్ సినిమా మాత్రం భారతదేశ సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాయడానికి సిద్ధమవుతోంది.