వార్ 2 టీజర్ విడుదలైన తర్వాత కియారా అద్వాణీ బికినీ లుక్ సినిమాకే హైప్ తెచ్చింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో కియారా చాలా స్టైలిష్‌గా కనిపించగా, ఓ చిన్న బికినీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం మూడు సెకన్లకు మించి కనిపించకపోయినా, కియారాకు ఇది యష్ రాజ్ ఫిల్మ్స్‌లో తొలి సినిమా కావడంతో స్పెషల్‌గా మారింది.
అయితే ఆ బికినీ సీన్ ఇప్పుడు చర్చలకు దారి తీసింది. కొంతమంది నెటిజన్లు ఆమె లుక్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “ఇది నిజంగా ఆమె బాడీనా? లేక ఏఐ వాడిందా?” అంటూ పోస్టులు పెడుతున్నారు. రెడ్డిట్, ఎక్స్‌లలో ఈ సీన్‌ను జూమ్ చేసి పెట్టిన స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి. “ఇది కృత్రిమంగా మార్చిన బాడీ లాగా ఉంది”, “అసలిది కియారా కాదు” అనే వ్యాఖ్యలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక మరోవైపు కియారా బికినీ లుక్‌ను ‘పఠాన్’ లో దీపికా పదుకొణె లుక్‌తో పోలుస్తూ చర్చలు సాగుతున్నాయి. ఎవరి లుక్ బెస్ట్ అన్నదానిపై ఓ వర్గం గొడవపడుతుంటే, మరికొంతమంది మాత్రం “ఏదైనా కావచ్చు, కాని సినిమాపై హైప్ పెరిగింది” అంటున్నారు. ఈ వీడియో వెనుక ఏ నిజం ఉన్నా, కియారా లుక్ సినిమాకి బజ్ కల్పించిందనడం తప్పు కాదు. ఆగస్టు 14న సినిమా విడుదలై అసలు విషయాలు బయటకు రావాల్సిందే.