కేజీఎఫ్ 2 నుండి క్రేజీ అప్ డేట్‌..స‌మ్మ‌ర్‌లో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ట‌!

బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్ళీ ఆ రేంజ్‌లో సౌత్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన చిత్రం కేజీఎఫ్‌. య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ సినిమా సెట్ చేసిన ట్రెండ్ మిగతా సినిమాల‌కు కూడా మార్గద‌ర్శ‌కంగా మారింది. తన బావ శ్రీమురళి హీరోగా ఉగ్రం సినిమా తీసి సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ రేండేళ్ళ త‌ర్వాత య‌ష్ హీరోగా కేజీఎఫ్ చిత్రాన్ని తీసి రికార్డుల రారాజుగా మారాడు. కేజీఎఫ్ చిత్రం ఇచ్చిన జోష్‌తో కేజీఎఫ్ 2 కూడా మొద‌లు పెట్టాడు ప్ర‌శాంత్ నీల్.

భారీ క్యాస్టింగ్‌తో కేజీఎఫ్ 2 చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్, ర‌వీనా టాండ‌న్, రావు ర‌మేష్ వంటి స్టార్స్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అధీరా అనే పాత్రలో సంజ‌య్ అద‌ర‌గొడ‌తాడ‌ని ఇన్‌సైడ్ టాక్. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, షూటింగ్ అయిపోయిందంటూ టీంతో కలిసున్న ఫోటోను విడుదల చేసాడు ప్రశాంత్ నీల్. వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ వ‌ర‌కు మూవీని రిలీజ్ చేయాల‌ని టీం ప్లాన్‌గా తెలుస్తుంది. అయితే కేజీఎఫ్‌ 1 విడుదలైన డిసెంబర్ 21న పార్ట్ 2కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇస్తాన‌న్న ప్ర‌శాంత్ నీల్ కొద్ది సేప‌టి క్రితం స‌ర్‌ప్రైజ్ రివీల్ చేశారు

జ‌న‌వ‌రి 8న య‌ష్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్బంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల 18 నిమిషాల‌కు రాఖీ భాయ్ ర‌చ్చ చేయ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది.గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు?.. ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక టీజ‌ర్‌కు సంబంధించి అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్ జ‌న‌వ‌రి నుండి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేసి స‌మ్మ‌ర్‌లో సినిమాని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రం క్రియేట్ చేసే సంచ‌ల‌నాలు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశం కావ‌డం ఖాయం అంటున్నారు.