“కేజీఎఫ్ చాప్టర్ 3” పై ఆసక్తికర సమాచారం ఇచ్చిన దర్శకుడు.!

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు కన్నడ రాకింగ్ స్టార్ యష్ లు హీరోలుగా నటించిన ఈ లేటెస్ట్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి రికార్డు వసూళ్లతో ఈ ఏడాదికి ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 

ఇక ఈ సినిమాకి కూడా సీక్వెల్ ని “కేజీఎఫ్ చాప్టర్ 3” కూడా అనౌన్స్ చేయడంతో ఇండియన్ సినిమా దగ్గర మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దీనితో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ మధ్యనే ఈ సినిమా నిర్మాత అనుకోని విధంగా పలు కామెంట్స్ చేయడం ఒక్కసారిగా సంచలనం రేపింది. 

దీనితో ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుందని వచ్చిన టాక్ హాట్ టాపిక్ అయ్యిపోగా తర్వాత అయితే అదేమీ లేదని ఖండించారు. కానీ ఇపుడు అయితే స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ నే ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వైరల్ అవుతుంది. 

తాను చెప్పిన దాని ప్రకారం అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 డెఫినెట్ గా ఉంటుంది అని. ఆ హింట్ ని ఆడియెన్స్ అయితే ఇష్టపడ్డారు. అందుకే డెఫినెట్ గా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు. కాకపోతే ఖచ్చితంగా పెద్ద బ్రేక్ తీసుకున్నాకే చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈ లెక్కన ఎన్టీఆర్ తో సినిమా అనంతరమే చేస్తాడని చెప్పాలి.