“సలార్”, “కేజీఎఫ్” లింక్ పై రాకీభాయ్ తల్లి కామెంట్స్..!

కన్నడ సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్నటువంటి కొన్ని సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లలో అక్కడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆవిష్కరించిన చిత్రాలు కేజీఎఫ్ మరియు సలార్ చిత్రాలు కూడా కాగా ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు ఒకే లింకప్ తో ఉన్నాయి అనే టాక్ కూడా ఆల్రెడీ ఉన్న సంగతి తెలిసిందే.

రాకీ భాయ్ గా కన్నడ స్టార్ యష్ మరియు సలార్ గా అయితే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాలు ఎక్కడో లింకప్ ఉన్నాయని టాక్ వచ్చింది. కాగా ఈ భారీ చిత్రాల్లో కేజీఎఫ్ నుంచి ఎంతో ఫేమస్ అయ్యిన నటి అస్సలు ఆ సినిమాకే మూలాధారం అయినటువంటి నటి అర్చన జాయిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

కాగా ఆమె లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సలార్ కేజీఎఫ్ చిత్రాలకి కనెక్షన్ ఉందో లేదో నాకు తెలీదని లేదనే ప్రస్తుతానికి అనుకుంటున్నాను అని తెలిపింది. అయితే ఒకవేళ తమ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిపినా పెద్ద ఆశ్చర్యం లేదని తెలిపింది.

దీనితో ఈ రెండు సినిమాల విషయంలో ఈ కీలక నటి చేసిన కామెంట్స్ మరింత ఆసక్తి రేపాయి. అసలు కేజీఎఫ్ అనే సినిమా అంతా తన తల్లికి ఇచ్చిన మాట మీదే నడుస్తుంది మరి అలాంటి ఆమెకే ఇంతవరకు ఏమీ తెలీదంటే ఆశ్చర్యకరం. కాగా ఈమె నటించిన తెలుగు మొదటి సిరీస్ మాన్సన్ 24 తో పరిచయం అయ్యింది.