కేజీఎఫ్-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెజియఫ్ సృష్టించిన సంచలనాలు ఇంకా ఎవరూ మరిచిపోలేదు కూడా. దాంతో రెండో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. మధ్యలో కరోనా వచ్చింది కానీ లేదంటే మాత్రం గతేడాదే సినిమా విడుదలై ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఆకాశంలో ఉంది.
తెలుగులో ఈ సినిమా రైట్స్ కోసం ఏఖంగా 70 కోట్లు కోట్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. తెలుగులో 70 కోట్లు అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఆ స్థాయిలో ఇక్కడ బిజినెస్ జరుగుతుంటుంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు ఈ స్థాయి బిజినెస్ చేస్తున్నారు. అలాంటి రేట్ ఇప్పుడు కెజియఫ్ 2 కోసం చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. అయినా కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమాను 66 కోట్లకు దిల్ రాజు హక్కులను సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.
తొలిభాగం కేవలం 5 కోట్లు మాత్రమే అమ్ముడైంది. అలాంటిది రెండో భాగం దాని కంటే 11 రెట్లు ఎక్కువ పలుకుతుంది. మరోవైపు కన్నడలో 100 కోట్ల సోలో బిజినెస్ జరుగుతుంది. మిళంలో 30 కోట్ల వరకు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఓవర్సీస్‌లో అయితే 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎలా చూసుకున్నా కూడా అన్ని భాషలలో కలిసి కెజియఫ్ 2 ఏకంగా 240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి