కేజిఎఫ్ 2 టెలివిజన్ ప్రీమియర్ తేది ఫిక్స్.. ఎప్పుడంటే..?

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా కేజిఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 సినిమాని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇటు సౌత్, అటు నార్త్ ఇండస్ట్రీలలో ఊహించని రీతిలో బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. దాదాపు 340 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1200 గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. బుక్ మై షో లో అత్యధిక టికెట్లు కొనుగోలు చేసిన సినిమాగా కేజీఎఫ్ 2 కొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం 17.1 మిలియన్ల టికెట్స్‌ అమ్మకాలతో ఇప్పటివరకూ ఉన్న బాహుబలి- 2 బుకింగ్స్‌ రికార్డ్‌ను కెజియఫ్ 2 బ్రేక్‌ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో
ఆర్ఆర్ఆర్ ని బ్రేక్ చేసిన కేజిఎఫ్ 2 సినిమా బాహుబలి-2 ని మాత్రం క్రాస్ చేయలేకపోయింది. హీరోగా కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఎస్ కేజిఎఫ్ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఒక్క సినిమాతో యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న కేజిఎఫ్ 2 సినిమా త్వరలోనే బుల్లితెర మీద ప్రసారం కానుంది. ఆగస్టు 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జీ సినిమాలలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇప్పటివరకు థియేటర్లలో ఓటీటీ లో కొత్త రికార్డ్స్ బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2 సినిమా బుల్లితెర మీద ప్రసారమై ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి. ఇక కేజిఎఫ్ 3 సినిమా షూటింగ్ కూడా తొందర్లోనే ప్రారంభం కానుటట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా దర్శకత్వం పనులలో ప్రశాంత్ నీలి బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కేజిఎఫ్3 సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.