ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్1 తో రాకింగ్ స్టార్ గా యష్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ లో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు యష్. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్2 రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ఈ క్రమంలో రీసెంట్ గా కేజీఎఫ్2 సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా ఈ టీజర్ రిలీజ్ అయిన 48 గంటల్లోనే ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్ ని రాబట్టి సంచలన రికార్డ్ నమోదు చేసింది. అంతేకాదు ఇప్పటికీ కేజీఎఫ్2 రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కంటే నాలుగు రెట్లు హై ఓల్టేజ్ తో కేజీఎఫ్2 ని తెరకెక్కించాడని తాజా గా రిలీజైన టీజర్ ద్వారా అర్థమవుతోంది. ముందు నుంచి అభిమానులు పెట్టుకున్న అంచనాలకి ఈ టీజర్ ఏ మాత్రం తగ్గలేదు. దాంతో త్వరలో రాబోతున్న ట్రైలర్ అండ్ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే తాజా టీజర్ రిలీజయ్యాక ఒక సెన్షేషన్ ఇష్యూ మొదలైంది. ప్రశాంత్ నీల్ నెగిటివ్ హీరోయిజంతో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ లో హీరో సిగరెట్ తాగే షాట్స్ కూడా పెట్టారు. సాధారణంగా ఇలాంటి షాట్స్ సర్వ సాధారణం. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కూడా ఈ సీన్స్ ని బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టీజర్, ట్రైలర్ లో కూడా ఇలాంటి షాట్స్ ని దర్శకులు సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం కోసం లాజికల్ గా పెడుతుంటారు. ఇప్పటికే చాలా సినిమాల టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో చూశాము కూడా.
అయితే ఈ మధ్య కాలంలో సినిమాలలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్న కొంత మంది ఏదో ఒక రకంగా సినిమాని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాటర్ ఏమీ లేకపోయినా కూడా చిన్న విషయాన్ని పట్టుకొని ఓ ఊగిపోతూ మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్2 విషయంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుంచి ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి. టీజర్ లో హీరో పొగతాగే షాట్స్ యువతని ప్రేరేపించే విధంగా ఉన్నాయని, వాటిని తక్షణం తొలగించాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయాన్ని యష్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పొగాకు అమ్మకాలని నియంత్రించకుండా ఇలాంటి సన్నివేశాలని నియంత్రించే ప్రయత్నం చేసి దండగ అని ట్రోల్ చేస్తున్నారు.