Keerthy Suresh: ఘనంగా కీర్తి సురేష్ వివాహం… కీర్తి మెడలో మూడు ముళ్ళు వేసిన ఆంటోని!

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ వివాహం నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో ఈమె వివాహపు వేడుకలు జరిగాయి అయితే ఇప్పటివరకు ఈమె వివాహానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను కూడా బయటకు వెల్లడించలేదు కానీ తాజాగా ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటో మాత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కీర్తి సురేష్ మెడలో ఆమె ప్రియుడు ఆంటోనీ హిందూ సాంప్రదాయ ప్రకారం మాంగల్య ధారణ చేశారు.

కీర్తి సురేష్ కాలేజీ సమయంలోనే ఆంటోనీ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఇలా గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గోవాలో మూడు రోజులు పాటు ఎంతో ఘనంగా జరుగుతోంది అయితే ఇప్పటివరకు ఈమె సంగీత హల్దీ వేడుకలకు సంబంధించి ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు కానీ పెళ్లి ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలా సాంప్రదాయ దుస్తులలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.

ఇక కీర్తి సురేష్ క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించినప్పటికీ హిందూ సాంప్రదాయ ప్రకారమే ఈమె మొదట పెళ్లి చేసుకున్నారు అయితే ఈ రోజు సాయంత్రం కూడా క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇక ఈమె పెళ్లి వేడుకలకు చాలా తక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. మరి సెలబ్రిటీలు ఎవరెవరు ఈమె పెళ్లి వేడుకలలో పాల్గొన్నారనేది తెలియాల్సి ఉంది.

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఈమె చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో నటించి సందడి చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన ఈమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ ఉన్న తరుణంలోనే ఈమె పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.