ఏంటి ఇలా తయారైంది?.. కీర్తి సురేష్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

మహానటి కీర్తి సురేష్‌ గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో నేను శైలజ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ఈ కేరళ భామ. మొదటి చిత్రంతోనే అందంగా కనిపించి, అద్భుతంగా నటించి టాలీవుడ్‌లో చోటు దక్కించుకుంది. వరుసగా చిత్రాలను ఏకంగా మహానటి సావిత్రి బయోపిక్ మహానటిలో నటించి తనకెవ్వరూ సాటిలేరని నిరూపించుకుంది. మహానటి చిత్రంతో కీర్తి సురేష్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిపోయింది.

Keerthy Suresh Transfers Into Zero Size
Keerthy suresh Transfers Into Zero Size

అయితే గ్లామర్, ఎక్స్ పోజింగ్, బికినీలకు కీర్తి ఆమడ దూరంలో ఉంటుంది. ఆ మధ్య బాలీవుడ్ చిత్రంలో బికినీ ధరించాలని చెబితే.. ఏకంగా ఆ ప్రాజెక్ట్‌ నుంచే తప్పుకుంది. అంతటి ధృద నిశ్చయంతో ఉంది కీర్తి. అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లోనూ నేరుగా బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రంతో నటించబోతోంది. ఇక దక్షిణాదిన అయితే ఎన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయో ఆమెకైనా తెలుసో లేదు.

లాక్‌డౌన్‌లో పెంగ్విన్‌తో సందడి చేసింది. గుడ్ లక్ సఖి అంటూ టీజర్‌తో అంచనాలు పెంచేసింది. రంగ్ దే అంటూ నితిన్‌ను ఆట పట్టించింది. టీజర్లతో ఈ రేంజ్‌ క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. అయితే కీర్తి మాత్రం ఇప్పుడు తెగ వర్కౌట్లు చేస్తోంది. ఒకప్పుడు కీర్తి బొద్దుగా, అందంగా, చబ్బీగా ఎంతో బాగుండేది. ఇప్పుడు మాత్రం మరీ బక్క పల్చగా, జీరో సైజ్ కంటే తక్కువగా అయిపోయింది. నిన్న కాఫీ డే సందర్భంగా ఓ పోస్ట్ చేయడంతో కీర్తి అసలు రూపం బయటపడింది. ఏది ఏమైనా కీర్తిని ఇలా చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అందమైన ఆ బుగ్గలు వెళ్లిపోయాయే అని బాధపడుతున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles