నాకు మగాళ్లకంటే అదే ఇష్టం.. కీర్తి సురేష్ రచ్చ మామూలుగా లేదే!!

Keerthy Suresh Miss India Tea Shirt Promotions

కీర్తి సురేష్ తన సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. మిస్ ఇండియా సినిమాతో కీర్తి సురేష్ నేడు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మేరకు సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. మిస్ ఇండియా సినిమా ట్రైలర్ ఇది వరకు ఆకట్టుకుంది. మన దేశంలో ఫేమస్ అయిన కాఫీని విదేశీయులకు రుచి చూపించి తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగేందుకు కీర్తి సురేష్ చేసే ప్రయత్నమే మిస్ ఇండియా. అందులోనూ మిస్ ఇండియా అంటే నేను కాదు.. బ్రాండ్ అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్‌లు బాగానే ఆకట్టుకున్నాయి.

Keerthy Suresh Miss India Tea Shirt Promotions
Keerthy Suresh Miss India Tea Shirt Promotions

అయితే సినిమాను చూసిన నెటిజన్లు మాత్రం మిస్ ఇండియాపై పెదవి విరుచుతున్నట్టు కనిపిస్తున్నారు. కాన్పెప్ట్ బలంగానే ఉన్నా కథనాన్ని నడిపించే విషయంలో తడబడ్డాడని అంటున్నారు. కీర్తి సురేష్ మాత్రం తన పాత్రలో జీవించిందని ప్రశంసిస్తున్నారు. అందంగా కనిపించడమే కాదు అంతకు మంచి క్యారెక్టర్‌లో జీవించిందని కామెంట్లు వినిపిస్తున్నారు. ముఖ్యంగా తమన్ నేపథ్య సంగీతం వేరే లెవెల్‌లో ఉందని కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి మిస్ ఇండియాతో కీర్తి సురేష్‌కు మంచి పేరే వచ్చేలా ఉంది.

 

అయితే ఈ మిస్ ఇండియాను వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది కీర్తి సురేష్. కాఫీ కావాలంటే షాప్.. టీ కావాలంటే కొట్టు.. అందులో ఒకటి ఫీలింగ్ రెండోది ఎమోషన్ అని టీ షర్ట్‌లు ధరించి మిస్ ఇండియాను పరోక్షంగా ప్రమోట్ చేసుకుంటోంది. నా ప్రియారిటీలో అబ్బాయిలకంటే చాయికే ఎక్కువ విలువ ఉంటుంది.. నాకు మగాళ్ల కంటే చాయ్ ఎక్కువగా ఇష్టమని చెబుతున్నట్టుగా ఓ టీ షర్ట్‌ను ధరించింది. ఇలా మొత్తానికి కీర్తీ సురేష్ తన సినిమాగాను బాగానే ప్రమోట్ చేసుకుంటుంది.