Miss India Trailer: మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్.. కీర్తి సురేశ్ నటనకు హేట్సాప్ చెప్పాల్సిందే..!

Keerthy Suresh Miss India movie Official Trailer out

కీర్తి సురేశ్.. ఓ మహానటి. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆమె ఏ సినిమాలోనూ నటించదు. జీవించేస్తుంది. తను ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా మిస్ ఇండియా. ఈ సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Keerthy Suresh Miss India movie Official Trailer out

ఈ సినిమా అఫిషియల్ ట్రైలర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సినిమాకు నరేంద్రనాథ్ డైరెక్టర్. జగపతిబాబు, నధియా ముఖ్యపాత్రల్లో కన్పించనున్నారు.

దసరా సందర్భంగా విడుదలైన మిస్ ఇండియ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మిస్ ఇండియా అంటే నేను కాదు.. అది ఒక బ్రాండ్ అంటూ కీర్తి చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తాయి.

Keerthy Suresh Miss India movie Official Trailer out

చాలామంది ఉద్యోగం అంటూ తిరుగుతుంటుంటే.. ఈ సినిమాలో కీర్తి సురేశ్ మాత్రం.. విదేశాలకు వెళ్లి మీర వ్యాపారం చేయాలనుకుంటుంది. ఓ సామాన్య యువతి.. విదేశాలకు వెళ్లి.. ఎలా బిజినెస్ ను పెట్టి సక్సెస్ అయింది.. అనేదే ఈ సినిమా కథ అని సినిమా ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. చివరకు దైర్యం చేసి విదేశాలకు వెళ్లి.. చాయ్ బిజినెస్ పెట్టి.. ఎంతో పేరు ప్రఖ్యాతలు గడిస్తుంది కీర్తి.

మొత్తానికి ట్రైలర్ లోనే సినిమా స్టోరీ ఏంటో చెప్పేశాడు డైరెక్టర్. ఇక.. ట్రైలర్ లో కీర్తి నటన చూస్తే విజిల్ వేయకుండా మాత్రం ఉండలేరు. మరో మహానటి లాంటి సినిమాతో కీర్తి సురేశ్ మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్నది. ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో నవంబర్ 4న రిలీజ్ కానుంది.