మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఈ మధ్యనే గోవాలో ఘనంగా పెళ్లి చేసుకుంది. తాను 15 సంవత్సరాల నుంచి ప్రేమించిన అంటోనీ తట్టిల్ ని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. కీర్తి హిందువు కాగా ఆంటోనీ క్రిస్టియన్ అయినా కూడా వీరి పెళ్లికి వాళ్ల పెద్దలు గాని కులాలు గానీ అడ్డు రాలేదు. ఈనెల 12 న గోవాలో వీళ్ళిద్దరూ ముందు హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
తాజాగా ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకున్నారు అయితే ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో ఒకటయ్యారు. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తి. ఆంటోనీ కీర్తి కిస్ చేయటం, ఇద్దరు రింగ్స్ మార్చుకోవటం, డాన్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో వెడ్డింగ్ గౌన్ వేసుకున్న కీర్తి సురేష్ ఏంజెల్ లా కనిపించింది. తమ ప్రేమకి గుర్తుగా పెంచుకున్న నైక్ (డాగ్ ) ని ఈ పెళ్లిలో హైలెట్ చేశారు కీర్తి సురేష్ దంపతులు.
దీపాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ 15 ఏళ్ల స్నేహబంధం జీవితాంతం కొనసాగుతుంది అని క్యాప్షన్ తో తమ బంధాన్ని బయటపెట్టింది కీర్తి సురేష్. వళి వేడుకల్లో భావారి ఇద్దరి మధ్య స్కూల్ రోజుల్లోనే స్నేహం మొదలైందని ఆ స్నేహం ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది. ఆంటోనీ వ్యాపార కుటుంబానికి చెందిన వాడు. అతనికి కొచ్చి, చెన్నైలో వ్యాపారాలు ఉన్నాయి. కీర్తి సురేష్ సంగతి మనందరికీ తెలిసిందే.
మహానటి సినిమాతో జాతీయ నటి అవార్డు అందుకున్న ఈ టాలెంటెడ్ వుమెన్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుంది. బాలీవుడ్ లో ఆమె మొదటిసారిగా నటించిన బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా హిట్ అయితే కీర్తి కెరీర్ మరింత పీక్స్ కి వెళ్తుంది అనటంలో సందేహం లేదు. కెరియర్ పరంగా ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్యోన్యంగా ఉండాలి అంటూ విషెస్ చెబుతున్నారు మహానటి ఫ్యాన్స్.