సర్కారు వారి పాట లో జాయిన్ అయిన కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ ..!

సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా జరుగుతోంది. నెలరోజుల పాటు ప్లాన్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు పరశురాం షూటింగ్ మొదలైనప్పటి నుంచి భారీ యాక్షన్ సీన్స్.. ఛేజింగ్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో సర్కారు వారి పాట 27 వ సినిమాగా రూపొందుతోంది. గత ఏడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ బాబు.

కాగా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని హాలీవుడ్ తరహాలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురాం. ఇక ఈ సినిమాకి సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో థమన్ – మహేష్ బాబు కాంబినేషన్ లో దూకుడు, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే సర్కారు వారి పాట మ్యూజిక్ ఆ సినిమాలకంటే భారీ హిట్ సాధించేలా థమన్ అద్భుతమైన ట్యూన్స్ ని రెడీ చేస్తున్నాడట. రీసెంట్ గా థమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ ని దుబాయ్ కి తీసుకు వెళ్ళి మహేష్ బాబు కి – పరశురాం లకి వినిపించాడు.

ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారని సమాచారం. కాగా ఈ షెడ్యూల్ లో హీరోయిన్ కీర్తి సురేష్ జాయిన్ కాబోతోంది. ఇప్పటికే దుబాయ్ లో దిగిన ఫొటోస్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద సాంగ్ తో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నాడట పరశురాం. ఇక ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే హైదరాబాద్ లో భారీగా నిర్మించిన బ్యాంక్ సెట్ లో నెలరోజుల పాటు సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ కూడా రెడీగా ఉంది. అలాగే మహేష్ సోలో సాంగ్ కూడా తెరకెక్కించేందుకు ఒక సెట్ రెడి చేశారు.