వామ్మో ఎవ్వరూ గుర్తు పట్టలేరుగా.. కాలేజ్ డేస్‌లో కీర్తి సురేష్

Keerthy Suresh College days pic with Her Bestie

ఇప్పుడంటే వెండితెరపై మహారాణులు రాజభోగాలను అనుభవిస్తుంటారు. కోట్ల హృదయాల్లో ఆరాధ్య దేవతలు కీర్తించబడుతుంటారు. కానీ వారి చిన్నతనంలో, చదువుకునే రోజుల్లో ఇంత స్థాయికి ఎదుగుతారని ఎవ్వరికీ తెలియదు. ఆ సమయంలో వారిని అంతగా ఎవ్వరూ పట్టించుకుని ఉండరు. కాజల్ అగర్వాల్, అనుష్క, నయనతరా, సమంత,కీర్తి సురేష్ ఇలా వీరంతా ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.. కానీ వీరి చిన్నతనం, చదువుకునే రోజుల్లో ఇలా ఉండేవారు కాదు.

రూపురేఖల్లో ఎంతో మార్పు వచ్చి ఉంది. కొందరు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. ఇంకొందరు సహజంగానే అందంలో మార్పులు వచ్చి ఉంటాయి. అయితే ఆ మధ్య కీర్తి సురేష్ ఓల్డ్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఉన్నది కీర్తి సురేష్ అని కూడా చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. ఇప్పుడు కీర్తి సురేష్‌కు గుండెల్లో గుడి కట్టుకుని పూజించే వారు కోట్లల్లోఉన్నారు. కానీ కీర్తి సురేష్‌ను ఒకప్పుడు చూసి అందరూ షాక్ అయి ఉంటారు.

Keerthy Suresh College days pic with Her Bestie

నల్లగా ఉన్నాకూడా కీర్తి సురేష్ మొహంలో ఆకట్టుకునే మాయ ఏదో ఉన్నట్టుంది. చదువుకునే రోజుల్లో కీర్తి సురేష్ ఫోటో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్‌తో దిగిన ఫోటో ఒకటి షేర్ చేయండని కీర్తి సురేష్‌ను అడగడంతో ఏమాత్రం సిగ్గు, మొహమాటం పడకుండా షేర్ చేసింది. అందులో కీర్తి సురేష్, ఇప్పుడున్న కీర్తి సురేష్‌కు అసలు పోలీకే లేదు. ఎంతో మార్పు వచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఓల్డ్ పిక్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.