Keerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ ఇటీవల తన స్నేహితుడు ఆంటోనీ తట్టీల్ తో వివాహం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం గోవాలోని రిసార్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ క్రిస్టియన్ అబ్బాయిని ప్రేమించినప్పటికీ వీరి వివాహం మాత్రం మొదట హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారమే జరిగింది.
ఇలా హిందూ సాంప్రదాయ పద్ధతిలో భాగంగా ఈమె సాంప్రదాయ దుస్తులను ధరించడమే కాకుండా మూడుముళ్లతో మాంగల్య ధారణ చేశారు. అయితే ఈ పెళ్లి అనంతరం కీర్తి సురేష్ తిరిగి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో కూడా వివాహాన్ని చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఈమె పెళ్లిలో కట్టుకున్న చీర ఎంతో ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే అయితే ఈ చీరకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కీర్తి సురేష్ తన పెళ్లి కోసం పెళ్లి చీరను ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారని తెలుస్తుంది. ఈమె కాంచీపురంలో ప్రత్యేకంగా ఈ చీరను నేయించినట్టు తెలుస్తుంది. ఈ చీర కోసం సుమారు 405 గంటలపాటు సమయం పట్టినట్టు తెలుస్తోంది. ఈ చీరలో ఎంతో మేలిమి బంగారు పోగులను అమర్చి ఈ చీర నేసినట్టు తెలుస్తోంది. ఇలా బంగారు జరీతో ఈ చీరను అద్భుతంగా తయారు చేయడం కోసం 405 గంటల సమయం పట్టడమే కాకుండా ఈ చీరకు కీర్తి సురేష్ లక్షల్లో ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఇక తన భర్త ఆంటోనీ వేసుకున్న పట్టు పంచ కూడా ఇలాంటి బంగారపు జరీతోనే వేసినదని ఈయన దుస్తులను తయారు చేయడానికి ఏకంగా 150 గంటల సమయం తీసుకుందని తెలుస్తుంది. ఇలా మన సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కీర్తి సురేష్ తన పెళ్లి వేడుకలను జరుపుకున్నారని చెప్పాలి.