సమంత గురించి అలా చెప్పలేను.. : కీర్తి సురేష్

ప్రస్తుతం దక్షిణాదిలో సమంత, నయనతార, కీర్తి సురేష్‌ల హవా నడుస్తోంది. అనుష్క కూడా రేసులో ఉంది. కానీ అనుష్క అంతగా సినిమాలు చేయడం లేదు కాబట్టి ప్రధానంగా ఈ ముగ్గురి మధ్య పోటి కనిపిస్తుంటుంది. మామూలుగా ఈ ముగ్గురు ఇప్పుడు దక్షిణాదిలో టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక హీరోయిన్ గురించి ఇంకొకరి దగ్గర అడిగితే వారి ఇగోలు హర్ట్ అవుతుంటాయి. అయితే అందరూ అలా ఉండరు. ఈ పోటీని కూడా ఎంతో స్పోర్టివ్‌గా తీసుకునే వారుంటారు.

Keerthy Suresh About Samantha Akkineni

కీర్తి సురేష్ కూడా ఈ కోవకు చెందినదే. తాజాగా కీర్తి సురేష్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. మిస్ ఇండియా మూవీ రిలీజైన సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు లైవ్ సెషన్ పెట్టింది. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఖుషీ చేసింది. ఇందులో భాగంగా నెటిజన్లు తమకు నచ్చిన ప్రశ్నలు అడగ్గా కీర్తి సురేష్ ఎంతో ఓపిగ్గా ఎంతో ప్రేమగా రిప్లై ఇచ్చింది. ఫ్యాన్స్ అంటే తన దృష్టిలో ఏంటని ప్రశ్నించగా.. కుటుంబం అని సమాధానం చెప్పి అందర్నీ ఫిదా చేసింది.

Keerthy Suresh About Samantha Akkineni

హారర్ మూవీస్ ఇష్టమా? కామెడీ సినిమాలంటే ఇష్టమా అని మరో నెటిజన్ అడిగాడు. హారర్ మూవీలు చూడటానికి ఇష్టపడుతాను.. కామెడీ సినిమాలు నటించేందుకు ఇష్టపడుతాను అని చెప్పింది. సమంత గురించి ఒక్క మాటలో చెప్పండి అని ఓ నెటిజన్ అడిగాడు. సమంత గురించి ఒక్క మాట అంటే సరిపోదు.. ఆమె ఎంతో స్మార్ట్, ప్రయోగాలు చేసేందుకు ముందుంటుది.. ఎప్పుడూ ఎదుటి వారిలో స్ఫూర్తినింపుతూనే ఉంటుందని పొగిడేసింది. ఈ ట్వీట్ చూసిన తరువాత.. ఎంతైనా లౌక్యమంటే కీర్తి సురేష్‌దే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.