కత్రినా కైఫ్ క్రేజ్ మామూలుగా లేదుగా… ఒక్క ప్రమోషన్ కోసం భారీగా రెమ్యూనరేషన్?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇలా ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోయిన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటారు.ఇలా సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి హీరోయిన్లలో కత్రినా కైఫ్ కూడా ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె నటుడు విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు.

నటుడు విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్నప్పటికీ ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫాలోవర్స్ లో కలిగే ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ షేర్ చేస్తూ ప్రమోట్ చేయడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఈ విధంగా కత్రినా కైఫ్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక్క పోస్ట్ చేస్తే సుమారు 97 లక్షలు అంటే ఇంచుమించు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

ఈ విధంగా ఒక్కో సినిమాకు సుమారు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే కత్రినా కైఫ్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక్క ప్రమోషన్ చేయడం కోసం కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియగానే ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది వామ్మో కత్రినా కైఫ్ చాలా కాస్ట్లీ గురూ అంటూ కామెంట్ చేస్తున్నారు.