షూటింగ్ స్పాట్‌లో క‌రోనా టెస్ట్‌.. విచిత్రంగా ప్ర‌వ‌ర్తించిన క‌త్రినా కైఫ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి ఈ ఏడాది వినాశ‌నం సృష్టించింది. ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల‌ని కుదేలు చేసింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ చాలా న‌ష్టాల‌ని చ‌వి చూసింది. ఏడునెల‌లుగా షూటింగ్స్ ఆగిపోవ‌డం, ఇప్ప‌టికీ థియేట‌ర్స్ తెర‌చుకోక‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీ అంతా అయోమ‌యంలో ప‌డింది. ఇప్పుడిప్పుడే క‌రోనా ఎఫెక్ట్ కాస్త త‌గ్గ‌ముఖం ప‌డుతుండ‌డంతో సెల‌బ్రిటీలు డేర్ చేసి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌లో జాయిన్ అయ్యే ముందు అంద‌రు క‌ర‌నా టెస్ట్‌లు త‌ప్ప‌క చేయించుకుంటూ లొకేష‌న్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు

Katrinaa | Telugu Rajyam

పొడుగు కాళ్ల సుంద‌రి కత్రినా కైఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో అప్పుడ‌ప్పుడు అలా మెరిసి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సూర్య‌వంశీ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ని శ‌ర‌వేగంగా నిర్వ‌హిస్తున్నారు.

సూర్య‌వంశీ షూటింగ్‌లో పాల్గొనేందుకు హాజ‌రైన క‌త్రినా కైఫ్ ముందుగా కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. ఆరోగ్ర భద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఈ టెస్ట్ చేయించుకున్నాను అంటూ త‌న‌కి టెస్ట్ చేసే వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే టెస్ట్ చేసే స‌మ‌యంలో క‌త్రినా కాస్త భ‌య‌ప‌డి వైద్యుడి చేయి ప‌ట్టేసుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఆ మ‌ధ్య పాయ‌ల్ రాజ్ పుత్ కూడా షూటింగ్‌కు హాజ‌ర‌య్యే స‌మ‌యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకొని అందుకు సంబందించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles