ఓటీటీలో మొదలు కానున్న కార్తీకేయ 2 సందడి.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిఖిల్ సిద్ధార్థ్ ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఈ క్రమంలో నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇటీవల విడుదలైన కార్తికేయ 2 సినిమా ఎవరు ఊహించని రీతిలో అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వం లో తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. పాన్ ఇండియా లెవల్ లో కోట్ల రూపాయల లాభం తెచ్చిపెట్టింది.

కార్తికేయ 2 సినిమా విడుదల కాక ముందు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన నిఖిల్ ఈ సినిమా విడుదలైన తర్వత బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. మొత్తం ఈ సినిమా రూ .120 కోట్లు వసూళ్లు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్‌ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కార్తికేయ 2 సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుందని సమాచారం. ఇప్పటికీ థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమాని ఓటిటి లో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 30 వ తేది నుండి ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి తొందర్లోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మొత్తనికి నిఖిల్ కెరీర్ లో కార్తీకేయ 2 సినిమా బిగ్గెస్ట్ హిట్ గా గుర్తుండిపోతుంది.