అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

Karthika Deepam Premi Viswanath In Tasty Nuts Ad

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో లేదో గానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ గడప గుర్తు పడుతుంది. అంతటి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది ప్రేమీ విశ్వనాథ్. మామూలుగా ప్రేమీ విశ్వనాథ్ బయట ఎక్కడా కూడా కనిపించదు.

Karthika Deepam Premi Viswanath In Tasty Nuts Ad
Karthika Deepam Premi Viswanath In Tasty Nuts Ad

కేవలం కార్తీక దీపం సీరియల్‌లోనే కనపిస్తుంది. బయట ఎక్కడా ఈవెంట్లు జరిగినా, ఎంత ఇస్తామని చెప్పినా కూడా రాదు. బయట ఇంటర్వ్యూలు, స్పెషల్ షోలు చేయనే చేయదు.కానీ 2020లో మాత్రం అవన్నీ జరిగాయి. మొదటిసారిగా ప్రేమీ విశ్వనాథ్ ఓ ఈవెంట్‌లో రచ్చ చేసింది. జాతరో జాతర అనే దసరా ఈవెంట్‌లో అమ్మ వారి వేషాన్ని వేసింది. ఇక సుమతో స్పెషల్‌గా ఓ మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

అలా ఎప్పుడూ బయట కనిపించని ప్రేమీ విశ్వనాథ్ కనిపించే సరికి అందరూ షాక్ అయ్యారు. కొందరు తమకు వచ్చిన ఫేమ్‌ను వాడుకుంటూ యాడ్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ప్రేమీ విశ్వనాథ్ మాత్రం ఎప్పుడూ కూడా తన ఇమేజ్‌ను వాడి యాడ్స్‌లొ నటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేమీ విశ్వనాథ్ ఓ యాడ్‌లో నటించింది. టేస్టీ నట్స్ అంటూ చేసిన ఈ యాడ్‌లో ప్రేమీ విశ్వనాథ్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.