పని లేక అలాంటి పనులు చేస్తున్నాడట.. కార్తీక దీపం డాక్టర్ బాబు వీడియో వైరల్

Karthika Deepam Nirupam Paritala Instagram Reel Video

కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులెవ్వరూ ఉండరూ. ఆ మధ్య ఓ వారం రోజులు సీరియల్‌లో కనిపించకపోవడం, ఇక అందులోంచి బయటకు వచ్చేశాడు.. ఇకపై కనిపించడనే రూమర్లు బయటకు వచ్చాయి. దానికి తోడు డాక్టర్ బాబు డబ్బింగ్ వాయిస్ కూడా మారిపోయింది. నిరుపమ్ డబ్బింగ్ చెప్పకుండా వేరే వాయిస్ వినిపించడంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు.

Karthika Deepam Nirupam Paritala Instagram Reel Video
Karthika Deepam Nirupam Paritala Instagram Reel Video

ఇక డాక్టర్ బాబు కనిపించడన్న అనుమానంతో ఆయన ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. నిరుపమ్ ఖాతాల్లో ఫ్యాన్స్ హల్చల్ చేశారు. మళ్లీ రావా? ఎక్కడికి వెళ్లావ్.. ఎందుకు కనిపించడం లేదు. గొంతు ఎందుకు మారింది అంటూ కామెంట్లతో నానా రచ్చ చేశారు. అయితే మళ్లీ డాక్టర్ బాబు కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా నిరుపమ్ ఓ వీడియోను షేర్ చేశాడు.

ఒకప్పుడు టిక్ టాక్‌లో సందడి చేసిన నిరుపమ్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్‌లో మొదటిసారి వీడియోను చేశాడట. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఎంతో మంది బాధపడ్డారు. అందులో మన డాక్టర్ బాబు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా రీల్ వీడియో చేస్తూ నాని వీ సినిమాలోని పాట పడాడు. పని లేక పాట అంటూ అదిరిపోయే క్యాప్షన్ పెట్టి రిలీ వీడియో చేశాడు. ప్రస్తుతం ఈ పాట, డాక్టర్ బాబు వీడియో బాగానే వైరల్ అవుతోంది.