కూతురు పుట్టిందని తండ్రి.. కార్తీక దీపం హిమకు ఎన్ని కష్టాలో!!

Karthika Deepam Hima Emotional In Its A famliy Party event

కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. తెలుగు ప్రజలకు కార్తీకదీపం సీరియల్, అందులోని పాత్రలు బాగా సుపరిచితం. బుల్లితెర ప్రేక్షకులు, మహిళా లోకానికి కార్తీకదీపం అంటే మాటల్లో చెప్పలేని క్రేజ్. ఆ సీరియల్‌లోని పాత్రలు కార్తీక్, దీపీ, వంటలక్క, డాక్టర్ బాబు, హిమ, శౌర్య వంటి కొన్ని పాత్రలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. వీరు బయట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Karthika Deepam Hima Emotional In Its A famliy Party event
Karthika Deepam Hima Emotional In Its A famliy Party event

సోషల్ మీడియాలో హిమ (సహృద), శౌర్య (కృతిక), కార్తీక్ డాక్టర్ బాబు (నిరుపమ్) సందడి చేస్తుంటారు. మామూలుగా కార్తీక దీపం టీం బయటకనిపిస్తే అది ఓ సెన్సేషన్ అవుతుంది. అందుకే దసరా నాడు జాతరో జాతర అని చెప్పి నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్‌ను స్పెషల్ గెస్ట్‌లుగా పట్టుకొచ్చారు. ఈ సారి సంక్రాంతి స్పెషల్‌గా పిల్లలను పట్టుకొచ్చారు. హిమ, శౌర్యలు సంక్రాంతి ఈవెంట్‌లో దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు.

ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూరాబోతోన్న ఈవెంట్‌లో సెలెబ్రిటీల కుటుంబాలను పిలిచారు. అందులో భాగంగా హిమ తల్లి వచ్చారు. కూతురు పుట్టిందని చెప్పి వదిలివెళ్లిపోయాడంటూ హిమ తల్లి ఎమోషనల్ అయింది. తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో హిమ ఒంటరిగానే తల్లి దగ్గర పెరిగిందట. ఈ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పి హిమ తల్లి కన్నీరు పెట్టేసుకుంది. హిమ కూడా వెక్కి వెక్కి ఏడ్చేసింది.