“కాంతారా” టీఆర్పీ..బుల్లితెరపై కూడా హిట్ చేశారు.!

గత ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో వసూళ్ల పరంగా దుమ్ము లేపిన సినిమాల్లో పాన్ ఇండియా హిట్ సినిమా “కాంతారా” కూడా ఒకటి.. ఈ సినిమా రిలీజ్ కావడం ఒరిజినల్ కన్నడ కన్నా మన దగ్గరే అధిక ఓపెనింగ్ నమోదు కావడంతో తెలుగు ఆడియెన్స్ సినిమాలని ఎలా చూస్తారు అనేది నిరూపించారు.

మరి ఈ సినిమాని రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా తానే హీరోగా నటించాడు. మరి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా అయితే 400  అందుకున్న ఈ సినిమా రీసెంట్ గానే తెలుగు బుల్లితెర మీద మొట్ట మొదటి సారిగా టెలికాస్ట్ కాగా తెలుగు బుల్లితెరపై కూడా ఈ సినిమాని మన వాళ్ళు హిట్ చేశారు.

అయితే  ఈ సినిమా తెలుగులో మొదటి సారిగా టెలికాస్ట్ కాగా స్టార్ మా కి 12.35 రేటింగ్ నమోదు అయ్యింది అట. ఇది రీసెంట్ గా మన తెలుగు సినిమాల కన్నా ఎక్కువే కాగా కన్నడ నుంచి అయితే ఆల్ టైం టాప్ 3 లో ఇది నిలిచింది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించగా ఆజనీస్ లోకనాథ్ సంగీతం అందించి భారీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని ఇచ్చాడు. అలాగే హోంబలె నిర్మాణ సంస్థ దీనిని నిర్మించగా దీనికి సీక్వెల్ ని కూడా ఇప్పుడు స్టార్ట్ చేయనున్నారు. ఇది కాంతారా కి ప్రీక్వెల్ గా రాబోతుంది.