ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఈ క్రమంలోని ఈయన తాజాగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గతంలో నిఖిల్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ విడాకుల వార్తలపై తాజాగా ఈయన మరోసారి స్పందించి క్లారిటీ ఇచ్చారు.నిఖిల్ 2020 మే 14వ తేదీ పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉండగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వీరి గురించి ఓ వార్త వైరల్ అయింది. అయితే ఈ వార్తలు విని ఒక్కసారిగా షాక్ అయ్యామని నిఖిల్ తెలిపారు.

 

ఇలా తమ విడాకుల వార్త రావడంతో స్టుపిడ్ అనుకొని ఆ తర్వాత నవ్వుకున్నామని తెలిపారు.అయితే ఈ విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏదైనా మంచి ఫోటో షేర్ చేద్దామని అనడంతో పల్లవి మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఇలాంటి వాటికి అన్నిటికి రియాక్ట్ కావాల్సిన అవసరంలేదని పల్లవి చెప్పినట్లు నిఖిల్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే మీడియా వాళ్ళు వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు ఇలాంటి వార్తలను చెక్ చేసుకుని రాయడం ఎంతో మంచిదని లేకపోతే లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని తెలిపారు.