“కాంతారా” ఓటిటి వెర్షన్..ఆడియెన్స్ కి బాగా డిజప్పాయింట్మెంట్.!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ ఓటిటి డిజిటల్ రిలీజ్ చిత్రం “కాంతారా”. కన్నడ నుంచి ఈ ఏడాది వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం ఇది. తెలుగులో 60 కోట్లకి పైగా గ్రాస్ హిందీలో 90 కోట్లకి పైగా గ్రాస్ కన్నడలో 180 కోట్లకి పైగా గ్రాస్ తో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కలని అయితే ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సొంతం చేసుకున్నారు.

మరి నిన్ననే ఈ సినిమాని ఈరోజు నుంచి అయితే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే చెప్పినట్టే అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న సినిమా రానే వచ్చింది. అయితే ఈ రావడంతోనే ఈ సినిమా ఆడియెన్స్ కి ఊహించని రీతిలో డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చింది.

మరి ఇదెలా అంటే మన తెలుగు వెర్షన్ లో సహా ఇతర వెర్షన్స్ లో కూడా భారీ హిట్ సాంగ్ “వరాహ రూపం” ఎలా పాతుకుపోయిందో తెలిసిందే. కానీ ఈ సాంగ్ థియేటర్స్ లో చూసిన దానికి తర్వాత మేకర్స్ రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు ప్రైమ్ లో ఉన్న దానికి చాలా తేడా వినిపించింది.

మ్యూజిక్ మారిపోయింది. గొంతు మార్చేశారు. టోటల్ గా అయితే ఇంతకు ముందు ఈ సాంగ్ విని మైమరచిపోయిన ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా డిజప్పాయింట్ అయిపోయారు. మరి ఇంతమంచి సాంగ్ ని ఎందుకు ఇంతలా మార్చేసారో అనేది కూడా తెలుస్తుంది. ఈ ట్యూన్ ని ముందే వేరే వాళ్ళు ఐదేళ్ల కితమే కంపోజ్ చెయ్యగా దాన్ని ఈ సినిమా సంగీత దర్శకుడు కాపీ కొట్టడంతో కాపీ రైట్ పడింది. దీనితో ఈ సాంగ్ తొలగించినట్టుగా తెలుస్తుంది.