కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం కాంతార. ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలు సెప్టెంబర్ 30వ తేదీ విడుదలై అద్భుతమైన రికార్డు సృష్టించడంతో ఈ సినిమాని వివిధ భాషలలో విడుదల చేశారు.ఇలా ప్రతి ఒక్క భాషలో ఈ సినిమా మంచి రికార్డులను సృష్టించడమే కాకుండా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇకపోతే థియేటర్లో ఎంతో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ 4వ తేదీ నుంచి ఓటీటీలోకి రాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదని నిర్మాతలు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఏ విధమైనటువంటి ప్రకటన రాకపోవడంతో ఒక నెటిజన్ ఏకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్ చేస్తూ ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు స్పందించిన అమెజాన్ ప్రైమ్ కాంతార సినిమా నవంబర్ 24 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది అంటూ రిప్లై ఇచ్చినప్పటికీ.. ఇలా రిప్లై ఇచ్చిన కాసేపటికి ఈ ట్వీట్ డిలీట్ చేశారు.బహుశా ఈ సినిమా అదే రోజున విడుదల కాదేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేయగా మరికొందరు ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నారని అందుకే ఇలా డిలీట్ చేశారనీ భావిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రాబోతుంది.