బిగ్ అప్డేట్ : కన్నడ మరో కేజీఎఫ్ “కబ్జా”..ఈ ప్రత్యేక రోజునే భారీ రిలీజ్.!

ఇండియన్ సినిమా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఆల్ మోస్ట్ అన్ని భారీ గ్రాసింగ్ చిత్రాలు కూడా అన్నీ మన తెలుగు సహా కన్నడ నుంచే ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రాల్లో కన్నడ రాకింగ్ హీరో యష్ నటించిన చిత్రం “కేజీఎఫ్” సినిమా నెలకొల్పిన సెన్సేషన్ కూడా అంతా ఇంతా కాదు. మరి దీనితోనే కన్నడ సినిమా కూడా మరోస్థాయిలోకి వెళ్లగా తర్వాత ఈ చిత్రం తర్వాత మరిన్ని సినిమాలు కన్నడ నుంచి హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత సేమ్ దీని లాంటి ఫీల్ నే ఇచ్చిన మరో భారీ చిత్రం “కబ్జా”. శాండిల్ వుడ్ స్టార్ అండ్ విలక్షణ నటుడు ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం కూడా కేజీఎఫ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఆ మధ్య దీని నుంచి వచ్చిన టీజర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా సెన్సేషన్ ని రేపింది.

మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించగా దీనిపై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఈరోజు అయితే చిత్ర యూనిట్ ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అనౌన్స్ చేశారు. మరి ఏఈ చిత్రం అయితే ఈ మార్చ్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

అయితే ఈ డేట్ లోనే ఎందుకు చేస్తున్నారంటే ఆరోజున కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా అతడికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తూ గుర్తుగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ బిగ్ అప్డేట్ ని అందించారు. మరి ఈ చిత్రం వరల్డ్ వైడ్ అయితే ఏకంగా 6000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారట.

స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా నటించిన ఈ పాన్ ఇండియా అన్ని భాషల్లో ఈ హై బడ్జెట్ సినిమా సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ వారు నిర్మాణం వహించారు. అలాగే కేజీఎఫ్ సంగీత దర్శకుడే రవి బాసృర్ ఈ చిత్రానికి కూడా నిర్మాణం వహించాడు.