దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఇప్పుడు పెళ్లి సందడి సీక్వెల్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పనుల్లోనే ఆయన తెగ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన మాజీ కోడుల పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. విషయం అర్థం కావడం లేదు కదా..అక్కడికే వస్తున్నాం. రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె ప్రముఖ సినిమా రచయిత అని చాలామందికి తెలిసే ఉంటుంది. హిమాన్షు శర్మ అనే మరో రచయితతో ఆమె ఏడడుగులు నడవబోతున్నారు. కొన్నిరోజులుగా వీళ్లిద్దరూ డేటింగ్‌లో వున్నారు. ఈ విషయాన్ని ఆరునెలల కిందట జూన్‌లోనే బాహ్య ప్రపంచానికి చెప్పేశారు. ఇప్పుడు రెండు కుటుంబాల నుంచి అనుమతి తెచ్చుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. కేదార్‌నాథ్ లాంటి పాపులర్ మూవీకి కనికా స్టోరీనిచ్చారు. హిమాన్శు ‘తనువెడ్స్ మను’ స్టోరీ రైటర్‌గా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు.
కనికా థిల్లాన్‌ది పంజాబీ రాష్ట్రం. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ కోవెలమూడిని ప్రేమించి పెళ్లాడారు కనికా. తర్వాత మూడేళ్లకు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు తీసుకున్నారు. తాజాగా కనికా హిమాన్షుతో కలిసి కొత్త కాపురం మొదలెట్టబోతున్నారు. కనికా థిల్లాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని పరిశీలిస్తే.. పంజాబీ యువతి అయిన కనికా థిల్లాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ కంపెనీలో వర్క్ చేసింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. ప్రకాశ్ జాగర్లమూడితో వివాహాం తర్వాత అనుష్క శెట్టి నటించిన సైజ్ జీరో… మన్మర్జియాన్, కేదారినాథ్, జడ్జిమెంటల్ హై క్యా సినిమాలకు వర్క్ చేసింది.
విడాకులపై ప్రకాష్ కోవెలమూడి గతంలో స్పందించారు. ‘‘నేను హైదరాబాద్‌లో సెటిలయ్యాను.. నా సోషల్ సర్కిల్ అంతా అక్కడే ఎక్కువగా ఉంది, కానీ ఆమె రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్ అయ్యారు.” అని ప్రకాష్ పేర్కొన్నారు. ‘‘మేము ఎందుకు విడిపోయాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇప్పటికీ ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కనికా తెలిపారు. భవిష్యత్‌లో కలిసి పనిచేస్తాం అని కూడా చెప్పారు.