తండ్రి ఆశించాడు కొడుకు నటిస్తున్నాడు

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్ ” సినిమాలో దర్శకుడు రాఘవేంద్ర రావు పాత్రలో నటిస్తున్నది ఎవరో తెలుసా ” ఎన్టీఆర్ ను రాఘవేంద్ర రావు అనేక సినిమాల్లో డైరెక్ట్ చేశాడు . వీరిద్దరిదీ సక్సస్ ఫుల్  కాంబినేషన్ .

రామారావు అంటే రాఘవేంద్ర రావు కు ఎంతో అభిమానం . ఆరాధనాభావం . ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో కనీసం  ఒక్క షాట్ అయినా దర్శకత్వం వహించే అవకాశం ఇప్పించమని బాలయ్యేను రాఘవేంద్ర రావు స్వయంగా కోరాడు .

ఇది జార్జగదని ఆయనకు తెలుసు . క్రిష్ కు ఇలాంటివి అస్సలు నచ్చవు . అయితే తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో రాఘవేంద్ర రావు పాత్రకు ఆయన కుమారుడు కోవెలమూడి ప్రకాష్  నటిస్తున్నట్టు తెలిసింది .

రాఘవేంద్ర రావు కోరికను ఇప్పుడు కొడుకు రూపంలో తీర్చడం ఆశ్చర్యంగా వుంది కాదు . ఈ ప్రతిష్టాత్మక సినిమా కు క్రిష్  దర్శకత్వం వహిస్తున్నాడు . జనవరి 9 న తొలి  భాగం “ఎన్టీఆర్ కథానాయకుడు ” విడుదల కాబోతున్నది .