మీకు వనితా విజయ్ కుమార్ గుర్తున్నదా? ఒకప్పుడు టాప్ హీరోయినే. ఇఫ్పుడు అడపా దడపా అవకాశాలు వస్తున్నట్టున్నాయి. ఆమెకు వివాదాస్పద నటి అని పేరు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వివాదాల్లోకి వెళ్తుంటుంది.
ఆమె ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నది. సినిమా ఇండస్ట్రీకే చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. మొన్ననే జూన్ 27న వీళ్ల పెళ్లి చెన్నైలో జరిగింది.
అయితే.. ఆమె మూడో పెళ్లి తర్వాత వనితపై ట్రోలింగ్ కూడా జరిగింది. చాలామంది నెటిజన్లు ఆమెను కావాలని టార్గెట్ చేశారు. అయినా కూడా ఆమె అందరికీ తనదైన శైలిలో సమాధానం చెబుతూ వస్తున్నది.
అయితే.. ప్రస్తుతం ఆమె భర్త పీటర్ పాల్ ఆరోగ్యం బాగాలేదట. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడట. ఆయనకు చాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భర్త హాస్పిటల్ లో చేరడంపై స్పందించిన వనిత… సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
పీటర్ కు ఆరోగ్యం బాగాలేదు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. దేవుడు చాలా గొప్పవాడు. ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకోసమే దేవుడిపై భారం వేసి ఆయన ఆరోగ్యం త్వరగా బాగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. అంటూ వనిత ట్వీట్ చేసింది.
ఆ ట్విట్ పై స్పందించిన వనిత అభిమానులు.. తన భర్త త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
వనిత 2007లో ఆకాష్ తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2007 లోనే ఆనంద్ జయరాజన్ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్నది. అతడితోనూ విడాకులు తీసుకొని మూడోసారి పీటర్ ను పెళ్లి చేసుకున్నది వనిత.