క్వీన్ కంగన రనౌత్, రాజ్ కుమార్ రావ్ జంటగా ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన జడ్జిమెంటల్ హై క్యా
ఇటీవలే విడుదలై విజయం సాధించింది. క్రిటిక్స్ సహా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాపై సినీరాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
కంగన కెరీర్ లో ఒక వైవిధ్యమైన సినిమా అంటూ వేదికలపై పొగిడారు. అయితే ఆ క్రెడిట్ మాత్రం ప్రకాష్ కోవెలమూడికి దక్కకుండా చేసింది కంగన. అతడి పేరును నామ మాత్రంగా అయినా వేదికలపై ప్రస్థావించని కంగన మరోసారి తన ఈగోయిస్టిక్ నేచుర్ ని ప్రదర్శించడంపై ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది.
అదంతా సరే తాజాగా ఈ చిత్రాన్ని దిల్లీలోని రాష్ట్రపతి భవన్ థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. వీళ్లంతా కేవలం తెరపై కనిపించిన కంగననే పొగుడుతున్నారు. కానీ తెరవెనక మేధావి అయిన ప్రకాష్ కోవెలమూడి గురించి ప్రత్యేకించి ఎక్కడా ప్రస్థావించలేదు. దీంతో బాలీవుడ్ మీడియాలో సైతం ప్రచారం కనిపించలేదు. అందుకు తగ్గట్టే అతడు `జడ్జిమెంటల్ హై క్యా` ప్రమోషన్స్ లో ఎక్కువ హడావుడి చేయకపోవడంపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓవైపు భార్య కనిక థిల్లాన్ నుంచి విడిపోయాడు అనే ప్రచారం హైలైట్ అవ్వడంతో.. ప్రకాష్ కోవెలమూడి ఒక గొప్ప సినిమా తీశాడు అన్నది మరుగున పడిపోయింది. ఈ
సన్నివేశం అతడికి నిరాశ కలిగించేదే. రాష్ట్రపతి భవన్ స్థాయి ప్రముఖుల్ని మెప్పించిన సినిమా తీశారు ప్రకాష్. కానీ రావాల్సిన ప్రచారమే కలిసిరాలేదు. ఆ మేరకు తెలుగు సినీపరిశ్రమ ప్రముఖుల్లోనూ దీనిపై చర్చ సాగుతుండడం ఆసక్తికరం.