గత కొన్ని రోజులుగా కంగాన రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. శివసేన మంత్రి సంజయ్ రౌత్ బాహాటంగానే కంగనాను బెదిరించాడు. మహారాష్ట్రలో అడుగుపెట్టొద్దు, వస్తే రాళ్లతో కొట్టి చంపుతారు అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వీటికి ఏ మాత్రం తలొగ్గని కంగనా ధీటుగా బదులిచ్చింది. మహారాష్ట్ర, ముంబై ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలా మొదలైన గొడవ.. కంగాన రనౌత్ కార్యాలయాన్ని కూల్చేవరకు వచ్చింది. తాజాగా కంగనావి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేశార. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
నేడు ముంబైలోకి అడుగుపెట్టిన కంగనాకు కర్ణి సేన భారీగా భద్రతను కల్పించింది. కానీ శివసేన తన ఇంటిని, కార్యాలయాన్ని కూల్చడంపై తీవ్ర స్థాయిలో మండి పడింది. నా ఇళ్లు అక్రమ కట్టడం కాదు.. అయినా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కోవిడ్ 19 దృష్ట్యా కట్టడాల కూల్చివేతలను సెప్టెంబర్ 30 వరకు రద్దు చేశారు.
ఇక మీరంతా (బాలీవుడ్) నవ్వుతూ ఈ దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేయండి అంటూ సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ కూల్చివేతలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తోందో అర్థమవుతోందని, ఉద్దవ్ ఠాక్రే వరెస్ట్ సీఎం అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి. ఇక కంగాన రనౌత్ ఇంకెలా రెచ్చి పోయి కామెంట్స్ చేస్తుందో మరి.