గత కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వార్తలే. ముంబైని చూస్తుంటే పీవోకేలా ఉంది అని అనడంతో స్టార్ట్ అయింది అసలు లొల్లి. అంతే.. ముంబైతో పాటుగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కంగనా రనౌత్ అంతమాట అంటుందా? ముంబైని పీవోకేతో పోల్చుతుందా? అని ఫైర్ అయ్యారు.
తర్వాత బీఎంసీ అధికారులు సడెన్ గా కంగన రనౌత్ ఫిలిం ఆఫీసును కూల్చేస్తామని నోటీసులు పంపించారు. అక్రమంగా దాన్ని నిర్మించారని… వెంటనే కూల్చేయాలంటూ అధికారులను పురమాయించారు. దీంతో కంగనా ముంబైకి చేరుకునేలోపే తన కార్యాలయం నేలమట్టం అయింది. బాంద్రాలో ఉన్న తన ఆఫీసును కేవలం మూడు ఇంచుల మేరకు…ఇంటికి అదనపు హంగులు చేయించుకోవడమే కంగనా చేసిన తప్పు. అయితే.. దానికి కంగనా బాంద్రా అధికారుల అనుమతి తీసుకోలేదట. దాన్ని సాకుగా చెప్పి బీఎంసీ అధికారులు కంగనా ఫిలిం ఆఫీసును కూల్చేశారు.
అయితే.. కావాలని బీఎంసీ అధికారులు తన బిల్డింగ్ ను కూల్చేశారని… కంగనా ఆరోపించడమే కాదు.. తనకు ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కూడా కంగనాకు మద్దతు పలికారు. కంగనాను ఆయన ఓదార్చి మీడియా ముందుకు వచ్చి తనకు అండగా నిలిచారు.
కంగనాకు అవమానం జరిగిందని.. ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. అలాగే తనకు ఆయన భరోసా ఇచ్చారు. ముంబైలో నివసించడానికి తనకు ఎటువంటి భయం అక్కర్లేదన్నారు. ముంబై అందరి ఆర్థిక రాజధాని అని ఆయన నచ్చజెప్పారు.
అయితే… కంగనాకు జరిగిన అవమానానికి బీజేపీ మద్దతు పలకడమే కాదు.. శివసేన వ్యతిరేక పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి. నిజానికి కంగనా బిల్డింగ్ నిర్మించే సమయంలో బిల్డర్ మూడు ఇంచుల అధిక స్థలాన్ని ఉపయోగించి బిల్డింగ్ నిర్మించాడు. ఇది కంగనాకు తెలియదంటూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీఎంసీ అధికారులు.. అక్రమంగా నిర్మించిన ఆ మూడు ఇంచుల స్థలాన్ని కూల్చేసినా.. లోపల ఉన్న గోడలు కూడా కూలిపోయి.. బిల్డింగే కుప్పకూలిపోయింది.