“బాహుబలి, కేజీఎఫ్ 2” లపై కమల్ హాసన్ షాకింగ్ స్టేట్మెంట్.?

తమిళ సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఒకరు. మరి కమల్ హాసన్ హీరోగా నటించిన గత చిత్రం “విక్రమ్” తో భారీ కం బ్యాక్ ని తాను అందుకోగా ఈ సినిమా తర్వాత అయితే ఆ మధ్య కాలం లో ఆగిపోయిన తన భారీ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” ని మళ్ళీ మొదలు పెట్టారు.

దర్శకుడు శంకర్ అప్పటికే కొంతమేర షూటింగ్ చేసి నిర్మాతలతో వచ్చిన గొడవలతో అయితే బయటకి వచ్చేసారు. దీనితో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోగా తర్వాత కమల్ హాసన్ మధ్యలో ఉండి అంతా సెటిల్ చేసి మళ్ళీ శంకర్ ని రప్పించారు. ఇక అలా శంకర్ రావడంతో మళ్ళీ సినిమాకి బ్రేక్ పడడంలేదు.

జెట్ స్పీడ్ లో ఒకో షెడ్యూల్ ని కంప్లీట్ చేస్తుండగా రీసెంట్ గా అయితే కమల్ హాసన్ ఇప్పుడు వరకు షూట్ చేసిన కొంతమేర ఫుటేజ్ ని అయితే తాను ప్రత్యేకంగా చూశారట. ఇది చూసాక పలు షాకింగ్ కామెంట్స్ తాను చేసారని కోలీవుడ్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఇండియన్ 2 సీక్వెల్ ముందు బాహుబలి, కేజీఎఫ్ 2 సినిమాలు నత్తింగ్ అంటూ తేల్చి చెప్పేశారట.

ఆ రేంజ్ లో ఈ సినిమా ఇప్పుడు వస్తుంది అని కమల్ అంత ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాహుబలి 2, కేజీఎఫ్ 2 లాంటి సీక్వెల్స్ ని మ్యాచ్ చెయ్యడం అంటే చిన్న విషయం కాదు మరి ఆ రేంజ్ టాక్ ఈ సినిమాకి వస్తుందో లేదో చూడాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.