మళ్ళీ హాలీవుడ్ లెవెల్ ప్లానింగ్ తో “కల్కి 2898” టీం??

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న భారీ చిత్రాల్లో వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ గా అయితే అనౌన్స్ చేసిన మొదటి చిత్రం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా చేస్తున్న సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898” కూడా ఒకటి. కాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి ఇండియా బిగ్ స్టార్స్ కూడా నటిస్తుండడంతో సినిమా స్పాన్ కూడా బాగా పెరిగింది.

దీనితో కల్కి సినిమాపై అంచనాలు మరింత లెవెల్లోకి వెళ్లగా ఈ సినిమాని మేకర్స్ వరల్డ్ లెవెల్లో ప్రెజెంట్ చేయాలనీ అప్పుడే ఫిక్స్ చేశారు. కాగా అందులో భాగం గానే మొట్ట మొదటిసారిగా హాలీవుడ్ ఈవెంట్ లో ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయగా ఇప్పుడు మళ్ళీ అదే హాలీవుడ్ లెవెల్లో అయితే ఇంకో ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో “కల్కి 2898 ఎడి” టీజర్ ని ఓ పేరు మోసిన హాలీవుడ్ ఈవెంట్ లో మొట్ట మొదటిసారిగా ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ పలు హాలీవుడ్ చిత్రాలు తాలూకా టీజర్ మరియు ట్రైలర్ లని కూడా అక్కడే లాంచ్ చేస్తారట.

అలాంటి ఒక గ్రాండ్ ఈవెంట్ లో కల్కి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఈ భారీ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా దిశా పటాని కూడా కీలక పాత్రలో నటించింది. అలాగే నిర్మాత అశ్విని దత్ ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిర్మాణం వహిస్తున్నారు.