ఇండస్ట్రీ టాక్ : “కల్కి 2898” కి ఆల్టర్నేట్ గా ఈ డేట్??

ఇప్పుడు తెలుగు సినిమా నుంచే కాకుండా ఇండియన్ సినిమా నుంచే మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ బడ్జెట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898” కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా ఉలగనయగన్ కమల్ హాసన్ ఇంకా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

దీనితో ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఒక మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ గా కూడా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్ లోకి వస్తుంది. ఇక మేకర్స్ కూడా సినిమా రిలీజ్ డేట్ ఈ మే 9 అని ఫిక్స్ కూడా చేసేసారు.

అయితే ఇప్పుడు కొంతమేర ఉన్న అనుమానాలతో అయితే సినిమా ఒకవేళ బై ఛాన్స్ వాయిదా కనుక పడితే ఆగష్టు విడుదలకి తీసుకురావాలనే ఆల్టర్నేట్ ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నారని ఇండస్ట్రీ టాక్ ఇక ఆ ఆగష్టు లో అంతా చూస్తున్న ఆగష్టు 15 డేట్ కే తీసుకురావాలని చిత్ర యూనిట్ చూస్తున్నారట.

అయితే దీనికి వెళ్లే అవకాశాలు తక్కువే ఉన్నాయని దాదాపు అనుకున్న డేట్ లోనే తీసుకొచ్చే ప్రయత్నాలు చిత్ర బృందం చేస్తున్నారని ఒకవేళ ఆన్ టైం అనుకున్నవి అన్నీ అవ్వకపోతే అప్పుడు ఆగష్టు రిలీజ్ కోసం ఆలోచిస్తారని భోగట్టా..