తెలుగు ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ప్రభాస్ నటించిన ‘కల్కి’ మాత్రమే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్ననేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు రెట్టింపు కూడా చేశారు. ఈక్రమంలో గ్లిమ్స్, టీజర్‌లు రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. తాజాగా చిత్రంలో ఓ ముఖ్య భూమి పోసిస్తున్న బుజ్జి అనే కారుకు సంబంధించి వీడియోను విడుదల చేసి ఆసక్తిని మరింత పెంచేశారు.
అయితే ‘కల్కి’ సినిమాకు పోటీగా అచ్చం అలాంటి కథాకథనాలతో, క్యారెక్టర్స్‌తో ఓ చిత్రం సిద్దమైంది. అది కూడా తెలుగులోనే వస్తుండడం గమనార్హం. అయితే ఇది మన దేశంలోనే ఫస్ట్ టైం సూపర్ ఉమెన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం అవడం విశేషం. ఆ సినిమా పేరు ‘ఇంద్రాణి’. యానీయా ప్రధాన పాత్రలో నటిస్తోండగా జిల్, సుప్రీమ్ సినిమాల్లో విలన్‌గా నటించిన కభీర్ సింగ్ ఈ చిత్రంలో సూపర్ విలన్‌గా నటిస్తున్నారు. స్టీఫెన్ పల్లం దర్శకత్వం వహించారు.
తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే ‘కల్కి’ సినిమాతో చాలా సారూప్యతలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’లో బుజ్జి అనే రోబో ఉన్నట్లే ఈ సినిమాలో చిట్టి అనే అదే టైపు, అదే తరహా రోబో కూడా ఉండడంతో పాటు 2021 ఏడీ అంటూ సినిమా జరిగే సమయాన్ని కూడా చూయించారు. ఇలా సినిమా అసాంతం చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను ఫ్యూచరిస్టిక్ వరల్డ్ నేపథ్యంలో ఆద్యంతం విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు.
ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ భవిష్యత్‌లో భారతదేశం టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుందో ఈ సినిమాలో చూపించబోతున్నామని, ఓ రోబో కూడా ఉంటుందని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ మంచిగా వచ్చిందని అందరినీ అకట్టుకుంటుందన్నారు. ఇదిలాఉండగా ఈ సినిమాను ‘కల్కి’ సినిమాకు రెండు వారాలు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ‘కల్కి’ జూన్ 27న విడుదల కానుండగా.. ఈ ‘ఇంద్రాణి అంతుకుముందే చిత్రం జూన్ 14న రిలీజ్ కానుంది.