రొమాంటిక్ సీన్లతో రచ్చ.. పాటతోనే మత్తెక్కించారు!

Kalayika O Maya From A Ad Infinitum Movie

ఓ చిన్న సినిమా జనాల్లో రీచ్ అవ్వడానికి ఎన్నో దారులున్నాయి. కథకథనాలు కొత్తగా ఉండాలి.. లేదంటే బోల్డ్ కంటెంటె‌ను నమ్ముకోవాలి. అన్నింటి కంటే ముందు ఆడియో అందరినీ మెప్పించేలా ఉండాలి. అయితే ఈ మధ్య మాత్రం చాలా మటుకు బోల్డ్ సీన్లతోనే యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా A అనే సినిమాల్లోంచి ఓ పాటను రిలీజ్ చేశారు. కలయిక ఓ మాయ అనే పాటలో రొమాన్స్‌తోనే నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.

Kalayika O Maya From A Ad Infinitum Movie
Kalayika O Maya From A Ad Infinitum Movie

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం A. ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్‌లలో వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పివి ఆర్ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది. ఇందులో భాగంగా అనంత్ శ్రీరామ్ రాసిన కలయిక ఓ మాయ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

సెన్సార్ సభ్యులు మూవీ చూసి.. చాలా కొత్తగా అద్భుతంగా ఉంది. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అభినందించారని చిత్ర దర్శకుడు యుగంధర్ చెప్పుకొచ్చాడు. ప్రవీణ్ బంగారి ఫోటోగ్రఫీతో పాటు విజయ్ కురాకుల మ్యూజిక్, ఆనంద్-పవన్ ఎడిటింగ్ మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.. చిన్న సినిమా అయినా సినిమా నచ్చి పివిఆర్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. ఇక నిర్మాత గీతా మిన్సాల మాట్లాడుతూ యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి ‘A’ చిత్రాన్ని బడ్జెట్ కి వెనకాడకుండా నిర్మించామని అన్నాడు.