డెబ్యూ హీరో త్రిపాత్ర‌లు డేర్ డెసిష‌నే

థ్రిల్లర్ జోనర్లో వస్తున్న తెలుగు సినిమా అనగానే ఏదో ఒక ఇంటర్నేషనల్ సినిమా నుంచి ఇన్స్ పైర్ అయి ఉంటుందని అనుకుంటారు. కానీ తొలిసారి ఓ తెలుగు సినిమా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ భాషలో రానటువంటి సరికొత్త కథాంశంతో తెరకెక్కిన అసలుసిసలైన థ్రిల్లర్ `A`. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఇటీవల రిలీజైన టైటిల్ పోస్టర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.

మొదటి సినిమాలోనే 3 పాత్రల్లో నటిస్తున్న నితిన్ ప్రసన్న దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని, పాత్రల మధ్య వ్యత్యాసం కొరకు ఎన్నో గెటప్స్ ని ట్రై చేస్తూ, నెలల తరబడి రెహార్సల్స్ చేసి ,అద్భుతంగ పోషించి అందరిని మెప్పించాడు.

బడ్జెట్ పరిమితిని దాటకుండా, సాధ్యమైనంత వరకు వీఎఫ్ ఎక్స్ ఉపయోగాన్ని తగ్గించి, పాత కెమెరా ట్రిక్ లను వాడి, మూడు పాత్రలు గల సన్నివేశాలని చిత్రీకరించారు. దీనికోసం సినిమా లోని ప్రతి ఫ్రేమ్ కు స్టోరీబోర్డ్ గీయించారు. ద‌ర్శ‌కుడు యుగంధర్ ముని మాట్లాడుతూ… ఈ సన్నివేశాల చిత్రీకరణకు ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకున్నానన్నారు. కంటెంట్ పరంగా తెలుగు సినిమా స్థాయిని `ఏ` మరింత పెంచేలా ఉంటుందని గర్వంగా చెప్పగలమన్నారు. నితిన్ ప్రసన్న , ప్రీతీ అశ్రాని ( మళ్లీరావా , ప్రెసర్ కుక్కర్ ), స్నేహల్ కమత్, బేబీ దీవెన (జబర్దస్త్), రంగధామ్, కృష్ణవేణి, భరద్వాజ్ ఈ చిత్రం లో ముఖ్య పాత్రల్లో నటించారు.

A hero