క‌ళ్ళు బైర్లు క‌మ్మిస్తున్న కాజ‌ల్ లెహంగా ధ‌ర‌…ఈ డ్రెస్ కోసం నెల రోజులు శ్రమించిన డిజైన‌ర్

35 ఏళ్ళ వ‌య‌స్సులోను త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న కుంద‌న‌పు బొమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అక్టోబ‌ర్ 30న త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లుని సంప్రదాయ ప‌ద్ద‌తిలో వివాహం చేసుకొని ఓ ఇంటిదైంది. ముంబైలోని తాజ్ హోటల్‌లో కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే మెహందీ, హ‌ల్దీ, పెళ్ళి వేడ‌క‌ల‌లో కాజ‌ల్ ధ‌రించిన దుస్తులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి కోసం కాజల్ అగర్వాల్ ధరించిన లెహెంగా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

పెళ్ళిలో గులాబి రంగు లెహంగాతో పాటు అందుకు త‌గ్గ జ్యువెల‌రీ ధరించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ రాకుమారిలా క‌నిపించింది. ఈ డ్రెస్ లో త‌మ అభిమాన న‌టిని చూసిన ఫ్యాన్స్ మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ప్రముఖ డిజైనర్.. అనామికా ఖన్నా డిజైన్ చేయ‌గా, దీని కోసం ఆమె ఎంతో శ్ర‌మించిన‌ట్టు పేర్కొంది. ఫ్లోరల్ డిజైన్‌లో జర్దోసి వర్క్ చేయడానికి నెల రోజుల పాటు 20 మందిలో ప‌ని చేశాం. దీనికి దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చు అయినట్టు అనామిక అన్నారు. అనామిక అనేక‌మంది సెల‌బ్రిటీల‌కు డిజైన‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఇక డ్రెస్ అనామిక డిజైన్ చేస్తే కాజ‌ల్ మెడ‌లో వేసుకున్న ఆభ‌ర‌ణాల నుండి తాళిబొట్టు వ‌ర‌కు సునీతా షెకావ‌త్ డిజైన్ చేశారు. కాజ‌ల్ త‌ల‌పై పెట్టుకున్న మాతాప‌ట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక గౌతమ్ కిచ్లూ ధరించిన షేర్వాణీని ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసారు. దీని ఖరీదు.. రూ. 1,15,000 అని సమాచారం. ఇక మెహందీ వేడుక‌లో కాజ‌ల్ గ్రీన్ రంగు కుర్తాలో మెర‌వ‌గా దీని ఖరీదు. పాతిక వేలు అని అంటున్నారు. కాగా, గౌతమ్, కాజల్ ఇద్దరూ కలిసి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చ‌దువుకోగా, అదే స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం గౌతమ్ కిచ్లు డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అని తెలుస్తుంది. ఇక కాజ‌ల్ కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది. మ‌రోవైపు ఆచార్య‌, మోస‌గాళ్ళు అనే చిత్రాల‌తో బిజీగా ఉంది.